CID సిట్ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్

by Muthe.Rajitha |

ఆన్లైన్ బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) బుధవారం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు.

CID సిట్ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆన్లైన్ బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) బుధవారం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన పారితోషకం, కమిషన్ వ్యవహారాలపై అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇదే కేసులో నిన్న నటుడు విజయ్‌ దేవరకొండను కూడా సిట్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వలన అనేకమంది యువకులు డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నారని సినీనటులతోపాటు పలువురు సెలెబ్రెటీల మీద కేసులు నమోదయ్యాయి.

ఈ వ్యవహారంలో సీఐడీ అడిషనల్ డీజీపీ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. సినీనటులు రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మందిపై కేసులు నమోదు చేసిన సీఐడీ.. వారందరినీ విచారిస్తోంది.

Next Story