- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుక్కాపీలుస్తుండగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. పదిమంది యువకులు అరెస్ట్
నగర శివారు ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నగర శివారు ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఒక హుక్కా సెంటర్‌పై పోలీసులు ఆదివారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, మత్తులో జోగుతున్న పది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక భవనంలో నిబంధనలకు విరుద్ధంగా హుక్కా సెంటర్ నడుపుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని దాడులు చేపట్టారు. పోలీసులు లోపలికి వెళ్లేసరికి యువకులు హుక్కా పీలుస్తూ మత్తులో తూగుతూ కనిపించారు. అక్కడికక్కడే పది మందిని పోలీసులు పట్టుకున్నారు.
హుక్కా సామాగ్రి సీజ్ - కేసు నమోదు..
ఈ దాడుల్లో హుక్కా పాట్‌లు, వివిధ రకాల ఫ్లేవర్లు మరియు ఇతర సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా హుక్కా సెంటర్లు నడిపినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా యువత ఇలాంటి వ్యసనాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.






