పాతబస్తీలో రౌడీ షీటర్ ఇంట్లో పోలీసుల తనిఖీలు.. దొరికిన ఆయుధాలు చూసి పోలీసులు షాక్

by Ajay Maddhiboyina |

గ‌త కొద్దిరోజుల క్రితం హైద‌రాబ‌ద్ లోని రెయిన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జునైద్ అనే వ్య‌క్తి హ‌త్య జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య కేసులో ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది.

పాతబస్తీలో రౌడీ షీటర్ ఇంట్లో పోలీసుల తనిఖీలు.. దొరికిన ఆయుధాలు చూసి పోలీసులు షాక్
X

దిశ‌, వెబ్ డెస్క్: గ‌త కొద్దిరోజుల క్రితం హైద‌రాబ‌ద్ లోని రెయిన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జునైద్ అనే వ్య‌క్తి హ‌త్య జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య కేసులో ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే పాత‌బ‌స్తీ యాక‌త్ పురా ప్రాంతంలోని రౌడీ షీట‌ర్ జాఫ‌ర్ ప‌హెల్వాన్, అత‌ని కుమారుల ఇళ్ల‌పై పోలీసులు తెల్ల‌వారుజామున దాడులు నిర్వ‌హించారు. సుమారు 60మంది పోలీసుల‌తో సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. కాగా తనిఖీల్లో దొరికిన వ‌స్తువులు చూసి పోలీసులే అవాక్క‌య్యారు.

రౌడీ షీట‌ర్ ఇంట్లో ప‌దునైన మార‌ణాయుధాలు ల‌భించాయి. ప‌లు ర‌కాల క‌త్తుల‌తో పాటు చిన్నాపాటి గొడ్డ‌ళ్లు, చాకులు, వేట కొడ‌వ‌ళ్లు దొరికాయి. అంతే కాకుండా కొన్ని అనుమానాస్ప‌ద ప‌త్రాల‌ను సైతం పోలీసులు ఈ త‌నిఖీల్లో గుర్తించారు. వాట‌న్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీట‌ర్ ఇంట్లో ప‌దునైన క‌త్తులు దొర‌క‌డంతో స్థానికులు సైతం భ‌యాందోళ‌న చెందుతున్నారు. అలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story