కారు పంపిస్తా.. ఎవరికీ కనిపించకుండా నా గవర్నమెంట్ క్వార్టర్‌కు వచ్చేయ్.. యువతికి పోలీస్ ఆఫీసర్ బెదిరింపు కాల్

by Sujitha Rachapalli |

మూడు రోజులుగా ఓ పోలీస్ ఆఫీసర్ అసభ్యకర ఆడియో కాల్ వైరల్ అవుతోంది. ఓ యువతికి పదే పదే ఫోన్ చేసిన పోలీస్.. ‘కారు పంపిస్తున్నా.. ఎవరికీ కనిపించకుండా నా గవర్నమెంట్ క్వార్టర్స్‌కు

కారు పంపిస్తా.. ఎవరికీ కనిపించకుండా నా గవర్నమెంట్ క్వార్టర్‌కు వచ్చేయ్.. యువతికి పోలీస్ ఆఫీసర్ బెదిరింపు కాల్
X

దిశ, వెబ్ డెస్క్ : మూడు రోజులుగా ఓ పోలీస్ ఆఫీసర్ అసభ్యకర ఆడియో కాల్ వైరల్ అవుతోంది. ఓ యువతికి పదే పదే ఫోన్ చేసిన పోలీస్.. ‘కారు పంపిస్తున్నా.. ఎవరికీ కనిపించకుండా నా గవర్నమెంట్ క్వార్టర్స్‌కు వచ్చేయ్.. రాత్రంతా ఇక్కడే ఉండిపో’ అంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఓ సారి బతిమాలినట్లుగా.. మరోసారి తిట్టినట్లుగా.. ఇంకోసారి అసభ్యకరంగా మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో కాల్ విన్న జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన వ్యక్తులే.. ఆదర్శంగా ఉండాల్సిన ఖాకీలే ఇలా చేయడం సిగ్గుచేటు అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా ఈ ఆడియో కాల్ ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్ జిల్లా గాగల్‌హెడి పోలీస్ స్టేషన్ ఇంచార్జి ప్రవీష్ శర్మకు సంబంధించినదిగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

VIDEO

Next Story