ఖజానా జ్యువెలరీ కేసును చేధించిన పోలీసులు.. బిహరీ దోపిడీ గ్యాంగ్ అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-15 09:14:38  IST  )

చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ (Khazana Jewelers)లో దొంగలు చొరబడి కాల్పులు జరిపి దోపిడీ చేసిన విషయం తెలిసింది.

ఖజానా జ్యువెలరీ కేసును చేధించిన పోలీసులు.. బిహరీ దోపిడీ గ్యాంగ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ (Khazana Jewelers)లో దొంగలు చొరబడి కాల్పులు జరిపి దోపిడీ చేసిన విషయం తెలిసింది. అయితే, తాజాగా ఆ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు దొంగతనానికి పాల్పడిన గ్యాంగ్‌ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బీదర్‌లో ఇద్దరిని, పుణెలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు బీహార్‌ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించి వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కాసేపట్లో మీడియాకు వెల్లడించానున్నారు.

కాగా, ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా జ్యవెలర్స్‌లో పట్టపగలే దుండగులు డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపారు. అనంతరం షాపులోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్‌ పగులగొట్టారు. అవన్నీ మూడు బ్యాగుల్లో నింపుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి బైకులపై పరారయ్యారు. పోలీసులు వచ్చే సమయానికే పారిపోయిన దొంగల ముఠా సీసీ కెమెరాలపై కాల్పులు జరిపి వాటిని కూడా ధ్వంసం చేశారు. అయితే, పోలీసులు విచారణలో భాగంగా దోపిడీ గ్యాంగ్ నెల రోజుల క్రితమే బీహార్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాసు పరిశ్రమలో పనిలో చేశారు. బీహార్‌ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకుని.. దాదాపు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి దోపిడీ చేసి ఉడాయించారు.

Next Story