విశాఖలో పోలీసుల తనిఖీలు.. రూ.10 లక్షల విలువ చేసే కొకైన్ స్వాధీనం

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో డగ్స్ (Drugs), గంజాయి (Ganja) అక్రమ రవాణాను అరికట్టేందుకు కూటమి సర్కార్ నడుంబిగించింది.

విశాఖలో పోలీసుల తనిఖీలు.. రూ.10 లక్షల విలువ చేసే కొకైన్ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డగ్స్ (Drugs), గంజాయి (Ganja) అక్రమ రవాణాను అరికట్టేందుకు కూటమి సర్కార్ నడుంబిగించింది. ఇటీవల కాలంలో యువత మత్తుకు బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో నిషేధిత మత్తు పదార్థాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా నార్కోటిక్ బ్యూరో, టాస్క్‌ఫోర్స్ టీమ్‌లతో కలిసి బస్టాండ్లు, ఎయిర్‌పోర్టులు, స్కూళ్లు, కళాశాలల్లో, ప్రధాన కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాత్రి విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల రహదారిలో ఆకస్మికంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల నుంచి 25 గ్రాముల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ బహిరంగ మార్కె్‌ట్‌లో రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Next Story