పది తప్పినందుకు విద్యార్థిని ఆత్మహత్య

by Javid Pasha |

యస్సార్ జిల్లా పెండ్లిమరి మండలం మాచనూరు గ్రామానికి చెందిన పొలతల అనూష అనే విద్యార్థిని పదో తరగతి ఫెయిల్ అయినందుకు ఆత్మహత్యకు పాల్పడింది.

పది తప్పినందుకు విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, కడప: వైయస్సార్ జిల్లా పెండ్లిమరి మండలం మాచనూరు గ్రామానికి చెందిన పొలతల అనూష అనే విద్యార్థిని పదో తరగతి ఫెయిల్ అయినందుకు ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్ష ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఆదివారం ఉదయం తన ఇంటిలోని బాత్ రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనూష చౌటపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతోంది. ఘటనా సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.

రోజువారీ పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు ఆంజనేయులు,శాంతి కుమారీలు కుమార్తె ఆత్మహత్యకు పాల్పడం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషాద సంఘటన గ్రామస్తులను కలచివేసింది. విద్యార్ధిని ఆత్మహత్య సమాచారం తెలిసిన వెంటనే తహశీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు సంఘటన స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించి పరామర్శించారు.

Next Story