- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాట్సాప్ హైజాక్‌కు స్కెచ్!
సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ లింక్‌లను వ్యాప్తి చేసేందుకు పెద్ద స్కెచ్ వేస్తున్నారు. దీని కోసం బాధితుల వాట్సాప్‌ను హైజాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దిశ, సిటీక్రైం: సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ లింక్‌లను వ్యాప్తి చేసేందుకు పెద్ద స్కెచ్ వేస్తున్నారు. దీని కోసం బాధితుల వాట్సాప్‌ను హైజాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వాట్సాప్ ను హైజాక్ చేసి అందులో ఉండే కాంటాక్ట్ నంబర్లకు ఏపీకే ఫైల్‌ను పంపిస్తున్నారు. అందులో ఉండే మాల్‌వేర్ ద్వారా ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారందరి ఫోన్‌లను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్‌ను రూపొందించి వాటిని వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా పంపిస్తారు. ఆర్టీవో చలాన్, క్రెడిట్ కార్డు లిమిట్ అప్‌డేట్ ఇలా ఆసక్తిని కలిగించే అంశాలను జోడించి పంపిస్తారు.
వాటిని చూసి ఆ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోగానే అందులో ఉండే వైరస్ (మాల్‌వేర్) మన ఫోన్‌లోకి వస్తుంది. ఆ తర్వాత ఫోన్ మొత్తం వారి కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది. మనం మన ఫోన్‌లో జరిపే లావాదేవిలు, ఇతర విషయాలను వారు గమనించి మనల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టడంతో పాటు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి మన దగ్గర నుంచి డబ్బంతా ఊడ్చేస్తారు. తాజాగా ఈ ఏపీకే ఫైల్ ద్వారా మన వాట్సాప్‌ను హైజాక్ చేసి అందులో ఉండే కాంటాక్ట్స్‌కు మనం పంపుతున్నట్లు ఏపీకే ఫైల్ రూపంలో మెసేజ్‌లు పంపి అందర్నీ బోల్తా కొట్టించేందుకు పన్నాగాలు పన్నుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏపీకే ఫైల్స్‌తో వచ్చే లింక్‌లు ఎట్టి పరిస్థితిలోనూ టచ్ చేయొద్దని, వాటిని వెంటనే డిలిట్ చేయాలని సూచిస్తున్నారు.






