ఎనిమిదో తరగతి విద్యార్థినికి పీఈటీ లైంగిక వేధింపులు

by Dishafeatures2 |
ఎనిమిదో తరగతి విద్యార్థినికి పీఈటీ లైంగిక వేధింపులు
X

దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్ లోని ఎస్ఆర్ డిజి స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థని పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. అయితే అతడికి భయపడి ఆ విద్యార్థిని ఎవరికీ చెప్పలేకపోయింది. కానీ అతడి వేధింపులు ఎక్కువ కావడంతో తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది ఆ బాలిక. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సిబ్బందిని నిలదీశారు. ఇక తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారన్న విషయం తెలుసుకున్న పీఈటీ ఫోన్ స్విచాఫ్ చేసి పాఠశాల నుంచి పారిపోయాడు. ఇక తల్లిదండ్రులు నిలదీస్తారనే విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ కూడా ఫోన్ స్విచాఫ్ చేసి పారిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పాఠశాలలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అనంతరం పాఠశాల దగ్గర ఆందోళనకు దిగారు.

ఫీజులపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల రక్షణపై లేదు

ఎస్ఆర్ డిజి స్కూల్ యాజమాన్యంకు ఫీజులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల రక్షణ పై లేకపోవటం దురదృష్టకరమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం విద్యార్థులకు కావలసిన కనీస సౌకర్యాలను సైతం కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. విద్యార్థులు వెళ్లే వాష్ రూమ్ కు కనీసం డోర్ సైతం లేదని, డోర్ బదులు కర్టెన్ వేసి సరిపెడుతున్నారంటే విద్యార్థుల రక్షణపై స్కూలు యాజమాన్యంకు శ్రద్ధ ఏమాత్రం ఉందో తెలుస్తోందని అన్నారు. ఓ పక్కా పోలీసులు తరచూ చైల్డ్ అబ్యూజ్ పై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ వద్దకు చేరుకుని యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed