జూటా కోర్ కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు : డీకే అరుణ

by Disha Web Desk 11 |
జూటా కోర్ కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు : డీకే అరుణ
X

దిశ, జడ్చర్ల : అబద్దాలు, మోసాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జూటా కోర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో అడిగే హక్కు లేదని ,ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ అటు దేశంలో కాంగ్రెస్ పార్టీలకు మనుగడలేదని, దేశం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ బీజేపీ నే రావాలని మహబూబ్నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఆదివారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలనగర్ రాజాపూర్ జడ్చర్ల మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే అరుణ కు బాలనగర్ మండలంలోని పెద్ద రేవెల్లి లో బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం బ్యాండ్ మేళాలు బాణాసంచాల మోతలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా డీకే అరుణ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు. డీకే అరుణ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదని, నిరుపేదల కష్టాలు తెలిసిన వ్యక్తి మోదీ అని అందుకే నిరంతరం నిరుపేదల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో చేయలేని ఎన్నో పనులను ఈ పదేళ్లలో ప్రధాని మోదీ చేశారని అన్నారు. మోడీ దేశ ప్రధానిగా ఉన్నాడు కాబట్టే దేశం మొత్తం హాయిగా నిద్రపోతుందని, ఇందిరమ్మ ఇండ్లతో కాంగ్రెస్ మోసం చేస్తుందని వారి కల్లబొల్లి మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని హితువు పలికారు.

6 గ్యాలంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని, ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటు వేసి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని మూడోసారి ఎన్నుకుందామని, తద్వారానే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పెద్ద రేవల్లి ప్రజలు నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలత్రిపుర సుందరి, బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితి రెడ్డి, బిజెపి మండల నాయకులు యువమోర్చా నాయకులు, బీజేపీ పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed