చంద్రబాబుపై జగన్ మరోసారి విమర్శలు.. ఈసారి నాన్ లోకల్ అంటూ టార్గెట్

by srinivas |
చంద్రబాబుపై జగన్ మరోసారి విమర్శలు.. ఈసారి నాన్ లోకల్ అంటూ టార్గెట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొత్తులో వస్తున్నారని, తాను మాత్రం సింగిల్‌గా వస్తున్నానని చెపపారు. మరో రెండు వారాల్లో మహాకురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని, ప్రజలు వైసీపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే తన పథకాలన్నీ రద్దు చేస్తారన్నారు. అదే జగన్‌కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. పొరపాటున కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దన్నారు. చంద్రబాబు నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని సీఎం జగన్ విమర్శించారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాన్ లోకల్ అని, ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ వెళ్లిపోతారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో వస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుది అబద్ధాల ఫ్యాక్టరీ అని విమర్శించారు. చంద్రబాబుకు గాని, పవన్ కల్యాణ్‌కు గాని రాష్ట్రానికి మంచి చేసిన చరిత్రేలేదన్నారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు తెలుసని, మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సీఎం జగన్ కోరారు. తన 58 నెలల పాలనలో ప్రతి కుటుంబానికి మంచి చేశామని చెప్పారు. లబ్ధిదారుల అకౌంట్లలోకే నేరుగా డబ్బులు వేశామన్నారు. చంద్రబాబులా తాను సెల్‌ఫోన్ కనిపెట్టానని చెప్పడంలేదన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని తెలిపారు. తన హయాంలో గ్రామాలను అభివృద్ధి చేశామని, తద్వారా రూపు రేఖలన్నీ మారిపోయాయని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు.

Read More...

జగన్‌ నటనకు ఆస్కార్ బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలి: నారా లోకేష్Next Story

Most Viewed