అలాంటి వ్యాధితో బాధపడుతున్నానంటూ.. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ గీతూ రాయల్

by Disha Web Desk 6 |
అలాంటి వ్యాధితో బాధపడుతున్నానంటూ.. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ గీతూ రాయల్
X

దిశ, సినిమా: గీతూ రాయల్ మొదట బిగ్‌బాస్ రివ్యూయర్‌గా యూట్బూబ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-6లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన అందం, అభినయంతో తనదైన ఆటతీరును చూపించింది. అంతేకాకుండా బిగ్‌బాస్‌లో చిత్తూర్ యాసలో మాట్లాడి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె మాటలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయనడంతో అతశయోక్తి లేదు. అయితే బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్ అయి గీతూ రాయల్ బయటకు వచ్చాక ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి తన ఫ్రెండ్ ధనుష్‌తో కలిసి యూట్బూబ్ వ్లాగ్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, గీతూ 5 నెలల నుంచి ఓ సమస్యతో బాధపడుతున్నట్టు తెలుపుతూ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న వీడియో షేర్ చేసింది. అంతేకాకుండా తనకు అలా కావడానికి కారణాలు కూడా చెప్పి షాకిచ్చింది.

గీతూ మాట్లాడుతూ.. ‘‘ నేను బ్యాంకాక్ వెళ్లి అనేక రకాల ఆహార పదార్థాలు తిన్నాను. బొద్దింకలు, పిట్టలు వంటివి అనేక రకాల స్పెషల్స్ తిని వచ్చాను. ఎందుకంటే.. చనిపోయేలోపు అన్ని చూడాలి, ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతోనే అలా చేశాను. అప్పటి నుంచే నాకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఇదే కాకుండా నేను ఓ ఇద్దరు అమ్మవార్ల దేవాలయాల వరకు వెళ్లి దర్శించుకోకుండా వచ్చాను. అది కూడా ఒక కారణం కావొచ్చని నాకు అనుమానంగా ఉంది. నా ఫ్రెండ్స్‌తో కలిసి నేను ఒకసారి విజయవాడకు వెళ్లాను. కానీ అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చేశాను. అలాగే తిరుచానూరుకు కూడా వెళ్లి దర్శనం చేసుకోకుండానే వచ్చాను.

అందుకే నాకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అనిపిస్తుంది. 5 నెలల నుంచి నేను హాస్పిటల్స్ తిరుగుతున్నాను. అయితే డాక్టర్లు కోటి మందిలో ఒకరికి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. దీంతో పెద్ద ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవడంతో అసలు విషయం తెలిసింది. దానికి రెండేళ్ల పాటు కంటిన్యూస్‌గా ట్రీట్‌మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. అలాగే ప్రతివారం ఇంజెక్షన్ వేయించుకోవాలని అన్నారు. ఈ సమస్యలతో బాగా ఆలోచించి నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ గీతూ తొందరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.





Next Story

Most Viewed