- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ పాలిట శాపంగా మారిన పీరియడ్స్.. ఇంతకీ ఏమైందంటే..?
ఆడవాళ్ల జీవితంలో పీరియడ్స్ రావడం ఒక భాగం.

దిశ, వెబ్‌డెస్క్ : ఆడవాళ్ల జీవితంలో పీరియడ్స్ రావడం ఒక భాగం. ఈ సమయంలో మహిళలు,ఆడవాళ్లు ఏ పూజ కార్యక్రమాలకు పాల్గొనవద్దు. అయితే ఈ ఆచారం వల్ల యూపీకి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఝాన్సీ జిల్లాలో పన్నా లాల్ గొల్లా కువాన్ ప్రాంతంలో ప్రియాంషా సోని (36) అనే మహిళ కుటుంబంతో కలిసి జీవిస్తుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సోనికి దుర్గాదేవి అంటే చాలా భక్తి ఉంది. దీంతో ఛైత్ర మాసంలో వచ్చే నవరాత్రి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటుంది. ఈ ఏడాది కూడా అలాగే జరుపుకోవాలని, పూజకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకుంది.
అయితే కరెక్ట్ గా నవరాత్రులు ప్రారంభం అవుతున్న మొదటి రోజే సోనికి పీరియడ్స్ వచ్చాయి. దీంతో తను పూజలో పాల్గొనలేకపోయింది. సోనికి ఇష్టమైన నవరాత్రుల వేడుకలను జరుపుకోలేకపోవడంతో.. బాగా ఆవేదన చెంది పురుగుల మందు తాగేసింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకున్న సోనీ ఆరోగ్యం కుదుటపడటంతో.. కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే కొద్ది రోజుల సోనీ ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది.






