బంగారం దొంగిలించిన ఇద్దరు అరెస్ట్.. ఎస్సై గోపికృష్ణ చాకచక్యం

by Bhanu |   (  Updated:2025-07-09 13:26:02  IST  )

వేర్వేరు దొంగతనాల కేసుల్లో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు.

బంగారం దొంగిలించిన ఇద్దరు అరెస్ట్.. ఎస్సై గోపికృష్ణ చాకచక్యం
X

దిశ, పెన్ పహాడ్ : వేర్వేరు దొంగతనాల కేసుల్లో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై గోపికృష్ణ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా TS-05-FR-1789 నంబర్ గల కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద 4.7 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఉన్నట్టు గుర్తించారు.

వీరిలో ఒకడు, ఖమ్మంపాటి నాగేశ్వర్ రావు (A-1) పాత నేరస్తుడిగా ఉండటంతో పోలీసులు ఇంటర్రోగేషన్ చేపట్టగా, జూన్ 20న పెన్ పహాడ్ గ్రామంలో గుండమనేని వెంకట్రావు ఇంటి తాళం పగలగొట్టి బంగారు హారం, చెవి కమ్మలు, రింగు, లాకెట్ మిళితంగా మొత్తం 4.7 తులాల బంగారం దొంగిలించినట్టు అంగీకరించాడు.

అదే విధంగా జూలై 5న మధ్యాహ్నం 1 గంట సమయంలో నాగేశ్వర్ రావు మరో నిందితుడు మామిడి జనార్దన్ (A-2) తో కలిసి దూపహాడ్ గ్రామంలోని పత్తిపాక సైదులు ఇంట్లోకి చొరబడి రూ. 2000 నగదు దొంగలించారని పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన బంగారం అమ్మేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.

నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, కారు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా స్పందించిన ఎస్సై గోపికృష్ణను, అతని సిబ్బందిని డీఎస్పీ ప్రసన్న కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story