నెమలిని వెంటాడి, వేటాడి.. చివరికి మృతి

by Chintha Aamani |   (  Updated:2025-08-06 13:32:17  IST  )

హుజూరాబాద్ పట్టణంలో ఒక నెమలి విషాదకరంగా మరణించింది

నెమలిని వెంటాడి, వేటాడి.. చివరికి మృతి
X

​దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ పట్టణంలో ఒక నెమలి విషాదకరంగా మరణించింది. పట్టణంలోని ఇల్లందుల వాడలో జనావాసాల్లోకి వచ్చిన ఒక నెమలిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో నెమలి తీవ్రంగా గాయపడింది.​ఈ దాడిని చూసిన స్థానిక పాల వ్యాపారి ఒకరు వెంటనే నెమలిని రక్షించడానికి ప్రయత్నించారు. ఆయన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నెమలికి ప్రథమ చికిత్స చేయడానికి ప్రయత్నించారు. కానీ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన నెమలి అప్పటికే చనిపోయింది.​అధికారులు చనిపోయిన నెమలిని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులను కాపాడటానికి మరింత శ్రద్ధ వహించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story