- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు
నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరుణపై కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అంతే కాకుండా నెల్లూరు సెంట్రల్ జైలు నుండి ఆమెను కడపకు తరలించారు.

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరుణపై కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అంతే కాకుండా నెల్లూరు సెంట్రల్ జైలు నుండి ఆమెను కడపకు తరలించారు. అరుణపై కోవూరు, నవాబ్ పేట, వేదాయపాలెం, విజయవాడలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అరుణ గత ప్రభుత్వ హయాంలో అనేక నేరాలకు పాల్పడినట్టు పోలీసుల రికార్డుల్లో ఉంది.
ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయవాడలో మోసాలకు పాల్పడినట్టు ఆమెపై కేసు నమోదైంది. అరుణ నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. కలెక్టర్ నుండి ఆమోదం లభించడంతో పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. అరుణతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు రౌడీ షీటర్లు ఎస్. జయప్రకాశ్, షేక్ షాహుల్ హమీద్ పైనా పీడీ యాక్ట్ నమెదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.






