ఏపీలో మైనర్‌పై అత్యాచారం.. పాస్టర్ అరెస్ట్

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కామ‌వ‌ర‌పుకోట మండ‌లానికి చెందిన చౌట‌ప‌ల్లి రాంబాబు 42 అనే పాస్ట‌ర్ మైన‌ర్ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

ఏపీలో మైనర్‌పై అత్యాచారం.. పాస్టర్ అరెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కామ‌వ‌ర‌పుకోట మండ‌లానికి చెందిన చౌట‌ప‌ల్లి రాంబాబు 42 అనే పాస్ట‌ర్ మైన‌ర్ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. రాంబాబు క‌ళ్ల‌చెరువు గ్రామంలో ఓ చ‌ర్చిని నిర్వ‌హిస్తుండ‌గా కూలిప‌నులు చేసుకుని బ‌తికే బాలిక 14 కుటుంబం గ‌త కొంత‌కాలంగా ఆ చ‌ర్చికి వెళుతోంది. ఈ క్ర‌మంలో బాలిక‌పై క‌న్నేసిన పాస్ట‌ర్ ఆమెను చెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. కొన్ని నెల‌లుగా పాస్ట‌ర్ బాలిక‌పై దారుణానికి పాల్ప‌డుతుండ‌గా విష‌యం బ‌య‌ట చెప్పొద్ద‌ని బెదిరించ‌డంతో ఆమె ఎవ‌రికీ చెప్పకుండా ఉంది.

ఈ క్ర‌మంలో బాలిక‌కు నెల‌స‌రి రాక‌పోవ‌డంతో పాస్ట‌ర్ అధిక మోతాదులో గ‌ర్భ నిరోధ‌క మాత్ర‌ల‌ను ఇచ్చాడు. తీవ్ర‌ర‌క్త‌స్రావం అవ్వ‌డంతో బాధితురాలు త‌ల్లికి విష‌యం చెప్పింది. ప‌రిస్థితి విషమంగా ఉండ‌టంతో బాలిక‌ను ఏలూరులోని ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాలిక త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసుకోగా తాజాగా అత‌డిని అరెస్ట్ చేశారు. నింధితుడిపై పోక్సో కేసు న‌మెదు చేయ‌గా అత‌డిని క‌ఠినంగా శిక్షించాల‌ని రాష్ట్ర‌వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story