- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. సైబర్ నేరగాళ్ల ‘సిమ్’ నెట్‌వర్క్ బట్టబయలు
సైబర్ నేరగాళ్లకు నకిలీ సిమ్ కార్డులు అందిస్తున్న అంతరాష్ట్ర ముఠాపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు పంజా విసిరారు.

దిశ, వెబ్‌డెస్క్: అమాయకులను దోచుకుంటున్న కిలాడీ సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌పై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ (Hyderabad Cyber Crime) పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ కేటుగాళ్లకు సపోర్టుగా ఉంటూ వారికి నకిలీ సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న భారీ ముఠాను ఛేదించారు. అత్యంత రహస్యంగా, వ్యూహాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ (Operation Octopus 3.0) ద్వారా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి ఏకంగా 66 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
7 రోజులు.. 18 టీమ్స్..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్‌క్రైమ్ విభాగం ఈ భారీ ఆపరేషన్ కోసం మొత్తం 18 స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించింది. దాదాపు 7 రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ బృందాలు మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ సోదాల్లో సైబర్ నేరగాళ్లు నేరాల కోసం వినియోగిస్తున్న, యాక్టివేట్ చేసి ఉన్న 1,194 ‘ఘోస్ట్ సిమ్ కార్డుల’ను పోలీసులు గుర్తించి సీజ్ కూడా చేసుకున్నారు.ఇతర గుర్తింపు కార్డులతో (Fake IDs) తీసుకున్న ఈ సిమ్ కార్డుల ద్వారానే నిందితులు రూ.కోట్లలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా ప్రాథమిక విచారణలో బట్టబయలైంది. అయితే, ఈ అంతరాష్ట్ర ముఠా అరెస్టుతో దేశవ్యాప్తంగా వందలాది సైబర్ నేరాల లింకులు బయటపడే అవకాశం ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి భారీగా మొబైల్ ఫోన్లు, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, ఫేక్ ఐడీ కార్డులు సీజ్ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.






