- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతోన్న ఐబొమ్మ రవి విచారణ.. క్లౌడ్ సర్వర్‌లో 21 వేల సినిమాల గుర్తింపు
మూవీ పైరసీ కేసులో అరెస్టు అయిన నిందితుడు ఐబొమ్మ రవి (Ravi)ని పోలీసులు వరుసగా రెండో రోజు అనేక అంశాలపై ప్రశ్నిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మూవీ పైరసీ కేసులో అరెస్టు అయిన నిందితుడు ఐబొమ్మ రవి (Ravi)ని పోలీసులు వరుసగా రెండో రోజు అనేక అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అతడిని చంచల్‌గూడ జైలు నుంచి గురువారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డేటా క్లౌడ్‌కు సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విచారణలో భాగంగా ఇవాళ సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్స్ అతడు ఇచ్చిన యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్‌తో ఉన్న క్లౌడ్ సర్వర్ తెరిచి చూడగా.. అందులో మొత్తం వివిధ రకాల ఓటీటీ కంటెంట్‌తో పాటు 21 వేల సినిమాలు ఉన్నట్లు గుర్తించారు.
అదేవిధంగా మూవీలు పైరసీ చేస్తున్న నాటి నుంచి పోలీసులకు పట్టుబడే వరకు ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలపై రవిని పోలీసులు ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. నిన్న మొత్తం వెబ్‌సైట్, డేటా మెయింటెనెన్స్ వంటి అంశాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరాతీశారు. తాజాగా నిందితుడు రవి మెయిల్‌ను పరిశీలించి డొమైన్ కొనుగోలు చేసిన బిల్లులను కూడా గుర్తించి కేసు ఫైల్‌లో ఇన్‌క్లూడ్ చేశారు. మరో రెండు రోజుల పాటు ఐబొమ్మ రవిని విచారించాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు.






