- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో, ద్విచక్ర వాహనం ఢీ యువకుని మృతి..
దిలావర్పూర్ గ్రామ శివారు ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ప్రాంతంలో నిర్మల్ వైపు వస్తున్నఆటో, ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.

X
దిశ, దిలావర్ పూర్ : దిలావర్పూర్ గ్రామ శివారు ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ప్రాంతంలో నిర్మల్ వైపు వస్తున్నఆటో, ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన గైని గణేష్ (18) సంవత్సరాల అనే యువకుడు మృతి చెందాడు. ఆటో వాహనదారుడు ఎటువంటి సిగ్నల్ వేయకుండా కుడి వైపుకు తిప్పడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న గైని గణేష్ ఆటో ముందు భాగం ఢీ కొట్టడంతో ఆటో అద్దం మేడ భాగంకు కుచ్చు కోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి దిలావర్పూర్ ఎస్సై గంగాధర్ చేరుకొని మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి పంపించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.
Next Story






