తాజ్‌ హోటల్‌ వద్ద కోటి రూపాయల దోపిడీ కేసులో ఒకరు అరెస్ట్

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లో రూ.కోటి దోపిడీ కేసులో పంజాగుట్ట పోలీసులు చేధించారు.

తాజ్‌ హోటల్‌ వద్ద కోటి రూపాయల దోపిడీ కేసులో ఒకరు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో రూ.కోటి దోపిడీ కేసులో పంజాగుట్ట పోలీసులు చేధించారు. ఈ కేసులో నేడు ఒక నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఇండియన్ కరెన్సీకి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తామని మోహిదీపట్నానికి చెందిన ఓ వ్యాపారవేత్తను ఫేక్ క్రిప్టో ముఠా మోసం చేసింది. రూ.కోటి విలువైన క్రిప్టో కరెన్సీ ఇస్తామని చెప్పి నిందితులు వ్యాపారవేత్తను తాజ్ హోటల్‌కు పిలిచారు. నగదు తీసుకున్న తర్వాత క్రిప్టో ట్రాన్స్‌ఫర్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. అనంతరం ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్విచ్‌ఆఫ్ వస్తుండటంతో.. మోసపోయానని గ్రహించిన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పంజాగుట్ట పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన ముఠాలోని హైమద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story