- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత.. ఒకరి అరెస్ట్
గుట్టు చప్పుడు కాకుండా ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి విదేశాలకు విదేశీ కరెన్సీ తరలిస్తూ సీఐఎస్ఎఫ్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి విదేశాలకు విదేశీ కరెన్సీ తరలిస్తూ సీఐఎస్ఎఫ్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుధవారం హైదరాబాద్ నుంచి (6E-1421) ఇండిగో విమానంలో షార్జా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయం వచ్చిన సయ్యద్ ఫరాన్ అనే ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయంలోని డిపార్చర్ వద్ద సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రయాణికుడి లగేజీని తనిఖీలు నిర్వహిస్తుండగా బ్యాగులో విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు.
బ్యాగ్ లో 30 వేల సౌదీ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి వద్ద స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ మొత్తం ఇండియా కరెన్సీ లో రూ. 6.50 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. విదేశీ కరెన్సీ తరలిస్తున్న ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.






