- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొలెరో వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి..
by Taduka Kalyani |
బొలెరో వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: బొలెరో వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(78) వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బొలెరో వాహనం వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వృద్ధురాలి మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






