యాసిడ్ తాగి వృద్ధురాలు ఆత్మహత్య..

by Disha Web Desk 20 |
యాసిడ్ తాగి వృద్ధురాలు ఆత్మహత్య..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : అనారోగ్యంతో బాధపడుతూ జీవితం పై విరక్తి చెంది యాసిడ్ తాగి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగిరెడ్డి పేట్ మండలంలోని ఆత్మకూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు గ్రామానికి చెందిన యాటకారి అనుషవ్వ (71) అనే వృద్ధురాలు గత ఐదు సంవత్సరాల క్రితం వెన్నుముక ఆపరేషన్ చేయించుకుంది. కాగా గత సంవత్సరం నుండి తీవ్ర మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ, అనారోగ్యానికి గురై జీవితం పై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఐదు గంటల సమయంలో తన ఇంటి బాత్రూం వద్ద యాసిడ్ తాగి పడిపోయి ఉంది.

కూతురు యాటకారి విజయ గమనించి తన భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అనుషవ్వను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో, కుటుంబ సభ్యులు అనుషవ్వను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా శనివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు, అనుషవ్వ కూతురు విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.



Next Story

Most Viewed