కుప్పకూలిన పాత భవనం.. ఇద్ద‌రు కార్మికులు మృతి

by Ratna Kumari |

దిశ‌, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ పట్టణంలోని మొండిగేరి, కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పాత భవనం ను

కుప్పకూలిన పాత భవనం.. ఇద్ద‌రు కార్మికులు మృతి
X

దిశ‌, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ పట్టణంలోని మొండిగేరి, కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పాత భవనం ను తొలగించే పనులు చేస్తుండగా పై కప్పు కూలి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు జీవ సమాధి అయిన మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. భవనం యజమాని లక్ష్మణ్ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా పాత భవనాన్ని తొలగించే పనులు చేపట్టగా ఉన్నట్టుండి ఒకసారిగా పై కప్పు కూలి నేలమట్టం కావడంతో, భవనం క్రింది భాగంలో పనిచేస్తున్న కూలీలు నవాబుపేట మండలం, రుద్రారం గ్రామానికి చెందిన గద్వాల కృష్ణయ్య(45) తండ్రి మునెప్ప, భూత్పూర్ మండలం, అమిస్తాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శాంతయ్య(60) తండ్రి ఎల్లప్ప లు మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మున్సిపల్, వన్ టౌన్ సీఐ అప్పయ్య, ఎస్ఐ సీనయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కి తరలించారు.

మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

నగరంలోని మొండిగేరి సమీపంలో జరిగిన పాత భవనం కూలిన సంఘటనలో ప్రమాదవశాత్తు చనిపోయిన గద్వాల కృష్ణయ్య, కుమ్మరి శాంతయ్య ల కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించి, జరిగిన దుర్ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, భవన్ యజమాని లక్ష్మణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకపై పాత భవనాలను తొలగించాలంటే ముందుగా నోటీసులు జారీ చేసి భద్రతాపరమైన చర్యలు తీసుకొని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కి ఆదేశించారు.

ప్రమాదస్థలిని పరిశీలించిన కలెక్టర్ విజయేందిర బోయి

పట్టణంలో ప్రమాదవశాత్తు కూలిపోయి ఇద్దురు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందిన సంఘటన తెలియగానే జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి సహాయక చర్యలకై అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డిఎస్పీ వెంకటేశ్వర్లు, అగ్నిమాపక అధికారి కిషోర్, నగరపాలక కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి లు ఉన్నారు.

Next Story