అయ్యో ఎంత ఘోరం..! 30 సెంట్ల భూమి.. రెండు ప్రాణాలు బలి

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-27 07:47:36  IST  )

ఆధునిక యుగంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి.

అయ్యో ఎంత ఘోరం..! 30 సెంట్ల భూమి.. రెండు ప్రాణాలు బలి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధునిక యుగంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. లోకంలో మానవత్వమనేది కనుమరుగైపోతోంది. ఓవైపు వావివరుసలు లేకుండా కామాంధులు రెచ్చిపోతుంటే.. మరోవైపు కన్నోళ్ల పట్ల కొందరు అత్యంత కర్కషంగా వ్యవహరిస్తూ సభ్యసమాజానికి మాయనిమచ్చగా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని విజయనగరం (Vizianagaram) జిల్లా పూసపాటిరేగ (Posapatirega) మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిద్రండులను కొడకే కాటికి పంపిన అమమానవీయ ఘటన నడిపూరికల్లాలు గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అప్పల నాయుడు (Appalnaidu), జయ (Jaya) దంపతులకు ఓ కూతురు, కుమారుడు రాజశేఖర్ (Rajashekar) ఉన్నారు. అయితే, ఇటీవలే వారు ఆస్తుల పంపకాల్లో భాగంగా రాజశేఖర్‌తో పాటు అతడి చెల్లికి ఓ 30 సెంట్ల భూమిని ఇచ్చారు. అది నచ్చని రాజశేఖర్ తల్లిదండ్రులపై కొన్నాళ్లుగా కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ కూతురు భూమిని అప్పలనాయుడు, జయ దంపతులు చదును చేయిస్తుండగా.. రాజశేఖర్ (Rajashekar) వారిపైకి అతి కిరాతకంగా ట్రాక్టర్‌ను ఎక్కించేశాడు. దీంతో ఆ దంపతులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అది చూసిన నిందితుడు రాజశేఖర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గ్రామస్థులు సమాచారం మేరకు ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story