- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నర్సు దారుణ హత్య.. లవ్ ట్రయాంగిల్ కారణమా?
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నర్సు హత్య సంచలనం సృష్టించింది. యువతి మృతదేహం గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న స్థితిలో గుర్తించిన పోలీసులు... లవ్ ట్రయాంగిల్ కారణంగానే హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నర్సు హత్య సంచలనం సృష్టించింది. యువతి మృతదేహం గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న స్థితిలో గుర్తించిన పోలీసులు... లవ్ ట్రయాంగిల్ కారణంగానే హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 23 ఏళ్ల ప్రియాంకా దాస్‌కు దుర్గేష్ అనే యువకుడితో ఫ్రెండ్‌షిప్ ఉంది. గత ఏడేళ్లుగా సన్నీ అనే వ్యక్తితోనూ స్నేహం ఉంది. వీరి ముగ్గురి మధ్య జరిగిన గొడవలే హత్యకు దారితీశాయని అంటున్నారు.
ప్రియాంక స్నేహితురాలు ఆమెను కలిసేందుకు గదికి వెళ్లగా.. రక్తపు మడుగులో కనిపించింది. ఆ తర్వాత హత్యకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించింది. ఘటనా స్థలంలో మృతురాలి ఛాతీపై మూడు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తోంది. కాగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఈ కేసులో అనుమానంతో ఓ యువకుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మృతుడి చేతిలో కత్తిని గుర్తించిన పోలీసులు.. గదిలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రియాంక దాస్ గత నెల రోజులుగా పచ్ పెడి నాకాలో రెంట్‌కు ఉంటుంది. ఎంఎంఐ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.






