- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్తూరు సమాచార శాఖ అధికారిక వాట్సప్ గ్రూపులో న్యూడ్ వీడియోల కలకలం
చిత్తూరు సమాచార శాఖ అధికారిక వాట్సాప్ గ్రూపులో న్యూడ్ వీడియోలు కలకలం రేపాయి. I&PR డిప్యూటీ డైరెక్టర్ ఫోన్ నుండి అధికారిక వాట్సాప్ గ్రూపులోకి వీడియోలు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు సమాచార శాఖ అధికారిక వాట్సాప్ గ్రూపులో న్యూడ్ వీడియోలు కలకలం రేపాయి. I&PR డిప్యూటీ డైరెక్టర్ ఫోన్ నుండి అధికారిక వాట్సాప్ గ్రూపులోకి వీడియోలు వచ్చాయి. దీంతో గ్రూపులో ఉన్న సభ్యులంతా షాక్ అయ్యారు. అయితే I&PR డిప్యూటీ డైరెక్టర్ ఫోన్‌ను హ్యాక్ చేసి వీడియోలు పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తన ఫోన్ హ్యాక్ అయిందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లను హ్యాక్ చేయడంతో పాటు వాట్సాప్ గ్రూపులు, ఇన్ స్టా పేజీలను సైతం హ్యాక్ చేస్తున్నారు. అధికారిక వెబ్ సైట్ లలో బెట్టింగ్ కు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసిన ఘటనలు సైతం రీసెంట్‌గా చోటు చేసుకున్నాయి. మరోవైపు ఎస్బీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో కూాడా ఇటీవల పైరసీ సినిమాల వెబ్ సైట్ ఐబొమ్మ దర్శనం ఇచ్చింది. దీంతో సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్‌కు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.






