- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి నగ్నంగా అపార్ట్‌మెంట్లలోకి న్యూడ్ మెన్ ఎంట్రీ.. నిద్రపోతున్న మహిళలపై అసభ్యకరంగా..
మలక్‌పేట, మూసారాంబాగ్ ప్రాంతాల్లో ఒంటిపై నూలుపోగు లేకుండా, శరీరం నిండా నూనె రాసుకుని తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని మలక్‌పేట పరిధిలో ఓ వ్యక్తి నగ్నంగా తిరుగుతూ మహిళలను, అపార్ట్‌మెంట్ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మలక్‌పేట, మూసారాంబాగ్ ప్రాంతాల్లో ఒంటిపై నూలుపోగు లేకుండా, శరీరం నిండా నూనె రాసుకుని తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. అతడిని అత్తాపూర్ ప్రాంతానికి చెందిన వ్యాపారిగా గుర్తించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
స్పైడర్‌మ్యాన్‌లా బిల్డింగ్‌లపై దూకుతూ..
గత కొన్ని రోజులుగా మలక్ పేటలోని గంగాధర్ అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసరాల్లోని స్లమ్ ఏరియాల్లో అర్ధరాత్రి సమయంలో ఈ నగ్న వ్యక్తి సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 17వ తేదీ అర్ధరాత్రి సుమారు 2:25 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న మహిళా కాలుపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మేల్కోని గట్టిగా కేకలు వేయడంతో అతను ఒక భవనం పైనుంచి మరో బిల్డింగ్ పైకి ఎంతో వేగంగా స్పైడర్‌మ్యాన్‌లా దూకుతూ తప్పించుకున్నాడు. మరో అపార్ట్ మెంట్ లో ఇళ్ల తలుపులు తీసే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలు అన్నీ సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. అయితే నిందితుడు గతంలో ఇదే ప్రాంతంలో నివసించినట్టు సమాచారం. అందుకే ఈ ఏరియాలోని వీధులు, బిల్డింగ్‌లపై అతనికి పూర్తి అవగాహన ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అతడు ఈ ప్రాంతాన్ని ఎంచుకుని తనకు నచ్చిన మహిళలను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అపార్ట్ మెంట్ వాసులు మలక్‌పేట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అతడిని కఠనంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడు ఒక్కడే కాదని అతడి వెనుక ఒక పెద్ద ముఠానే ఉందని ఆరోపించారు. అతనికి సపోర్ట్‌గా మరో ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చారని బాధితులు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అతనితో పాటు ఉన్న మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. మరోవైపు అతడు సైకో అని కొందరు పేర్కొంటున్నా.. బాధితులు మాత్రం అది నమ్మడం లేదు. సైకో అయితే కార్ ఎలా నడుపుతాడు? బట్టలు విప్పుకుని రోడ్లపై తిరగకుండా నేరుగా ఇళ్లల్లోకి ఎలా వస్తాడు? అని ప్రశ్నిస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలోకి ఇలాంటి వారు వస్తే ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.






