దారుణం.. మహిళ గుండు గీసి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఓ గ్రూప్..

by Sujitha Rachapalli |

నైజీరియా నైజర్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మరిగా లోకల్ గవర్నమెంట్ ఏరియాలోని కసువాన్-గర్బాలో ఓ మహిళను సజీవదహనం చేసింది ఓ గ్రూప్. స్థానికంగా ఆహారం విక్రయించే మహిళ అయిన అమాయే..

దారుణం.. మహిళ గుండు గీసి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఓ గ్రూప్..
X

దిశ, వెబ్ డెస్క్: నైజీరియా నైజర్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మరిగా లోకల్ గవర్నమెంట్ ఏరియాలోని కసువాన్-గర్బాలో ఓ మహిళను సజీవదహనం చేసింది ఓ గ్రూప్. స్థానికంగా ఆహారం విక్రయించే మహిళ అయిన అమాయే.. మహమ్మద్ ప్రవక్తను దూషించిన ఆరోపణలతో ఓ గ్రూప్ దారుణానికి ఒడిగట్టింది. ఆమె గుండు గీసి.. రాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. లీసులు ఈ హత్యను జంగిల్ జస్టిస్‌గా ఖండించారు. నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

ఆగస్టు 30న జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇస్లామిక్ సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ ఆమె మేనల్లుడితో జరిపిన సంభాషణ ఇక్కడి వరకు దారితీసినట్లు తెలుస్తోంది. కాగా నైజీరియా సుప్రీం కోర్టు దైవదూషణ ఆరో పణలు చట్టపరమైన కోర్టులో నిరూపించబడాలని తీర్పు ఇచ్చింది, ఇటువంటి అనధికార హత్యలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. మరోవైపు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అండ్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా వంటి హక్కుల సంస్థలు ఈ సంఘటనను ఖండించాయి.

Next Story