హైదరాబాద్‌లో మరోసారి గంజాయి కలకలం

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో మరోసారి గంజాయి కలకలం

హైదరాబాద్‌లో మరోసారి గంజాయి కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి గంజాయి(Cannabis) విక్రయాలు కలకలం రేపాయి. ఆదివారం నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ స‌మీపంలో కొందరు మహిళలు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 532 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ప‌ది మందిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, ఇటీవలే నానక్‌రాంగూడ గంజాయి క్వీన్‌ నీతూబాయి నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆమె లేకున్నా కుమారుడు దుర్గాప్రసాద్, మరో ఇద్దరు పోలీసులకు చిక్కారు. 786 గ్రాముల గంజాయి, 110 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈమె చిక్కితే ఐటీకారిడార్, ధూల్‌పేటలో గంజాయి సరఫరా ఆగుతుందంటున్నారు.

Next Story