- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య
వికారాబాద్(Vikarabad) జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్(Vikarabad) జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి అయిన మూడ్రోజులకే నవ వధువు ఆత్మహత్య(Bride Suicide)కు పాల్పడింది. అత్తగాటి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి శ్రీలత(Srilatha) పురుగుల మందు తాగింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. భర్త వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని శ్రీలత పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ శివాజీ కూడలిలో బైఠాయించారు. మహబూబ్‌నగర్-తాండూర్ హైవేపై మృతదేహంతో బంధువుల ధర్నాకు దిగారు. ఈనెల 26న ఫరూక్ నగర్ మండలం భీమవరం గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఈనెల 27న దోమ మండలం మోత్కూరు గ్రామంలోని వధువు మామ ఇంటికి నవ వధువు, వరుడు వచ్చారు.. 28న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






