ఏమండీ సారీ.. మీ అమ్మ, అక్కాచెల్లెళ్ల టార్చర్ భరించలేను.. నవ వధువు ఆత్మహత్య

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్లో విషాదం చోటు చేసుకుంది. నవ వధువు ఆత్మహత్య స్థానికంగా కన్నీరు పెట్టిస్తోంది. న్యూ మండి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన సూసైడ్.. సమాజంలో వరకట్న నిషేధం, గృహహింసపై మరోసారి చర్చను రేకిత్తిస్తోంది. శివపురికి చెందిన ఆకాంక్షకు..

ఏమండీ సారీ.. మీ అమ్మ, అక్కాచెల్లెళ్ల టార్చర్ భరించలేను.. నవ వధువు ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్లో విషాదం చోటు చేసుకుంది. నవ వధువు ఆత్మహత్య స్థానికంగా కన్నీరు పెట్టిస్తోంది. న్యూ మండి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన సూసైడ్.. సమాజంలో వరకట్న నిషేధం, గృహహింసపై మరోసారి చర్చను రేకిత్తిస్తోంది. శివపురికి చెందిన ఆకాంక్షకు.. జనవరి 30న మయాంక్ శర్మతో పెళ్లి జరిగింది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నా.. అత్త, మరదళ్లు మాత్రం టార్చర్ పెట్టాడు. శారీరకంగా, మానసికంగా హింసించారు. వరకట్న డిమాండ్స్‌ తీర్చాలని వేధింపులకు గురిచేశారు. దీంతో విసిగిపోయిన ఆకాంక్ష.. సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది. సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. ‘సారీ బాబు’ అంటూ భర్తకు క్షమాపణ చెప్పిన ఆమె.. ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు తల్లిదండ్రులను క్షమాపణలు కోరింది. తన చావుకు కారణం అత్త, మరదళ్లు అని ఆత్మహత్య లేఖలో పేర్కొంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. సెక్షన్ 80కింద కేసు నమోదు చేశామని.. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందం ఏర్పాటు చేశామని తెలిపారు.

Next Story