- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమ్మకంగా చేరారు.. నిలువునా దోచేశారు: హైదరాబాద్‌లో మరో భారీ చోరీ
నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో మరో భారీ చోరీ కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో మరో భారీ చోరీ కలకలం రేపింది. నమ్మకంగా ఇంట్లో పనికి చేరిన నేపాల్‌కు చెందిన దంపతులు, యజమాని లేని సమయం చూసి సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలతో ఉడాయించారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని అనిరుధ్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో 45 రోజుల క్రితమే నేపాల్‌కు చెందిన ఒక దంపతులు పని మనుషులుగా చేరారు. వీరిపై నమ్మకంతో యజమాని కుటుంబం ఇంటి బాధ్యతలను వారికి అప్పగించింది.
శనివారం రాత్రి రాత్రి అంతా పడుకున్న తర్వాత అదే అదనుగా భావించిన దంపతులు ఇంట్లోని లాకర్లను పగులగొట్టారు. అందులో ఉన్న విలువైన వజ్రాల హారాలు, బంగారు ఆభరణాలు, రోలెక్స్ వాచీలు మరియు నగదును దోచుకుని పారిపోయారు. ఆదివారం ఉదయం యజమాని లాకర్లు తెరిచి ఉండటం మరియు పని మనుషులు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంట్లో పని మనుషులను పెట్టుకునే ముందు వారి పూర్తి వివరాలు మరియు ఆధార్ కార్డులను సమీప పోలీసు స్టేషన్‌లో ఇచ్చి 'పోలీస్ వెరిఫికేషన్' చేయించుకోవాలని పోలీసులు నగరవాసులకు సూచిస్తున్నారు.






