- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్తంగా DRI బిగ్ ఆపరేషన్: ఈ-సిగరెట్ల స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టు
దేశంలో నిషేధిత ఈ-సిగరెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టును డీఆర్‌ఐ (DRI) రట్టు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నిషేధించిన ఈ-సిగరెట్లు (E-Cigarettes), వేప్స్ (Vapes) అక్రమ రవాణా చేస్తున్న భారీ స్మగ్లింగ్ రాకెట్ ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో భారీ ఎత్తున నిషేధిత నికోటిన్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఈ-సిగరెట్ల స్మగ్లింగ్‌పై పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్‌ఐ అధికారులు దేశంలోని కీలక రాష్ట్రాలైన ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లలో మెరుపు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో దాదాపు రూ.120 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 3 లక్షలకు పైగా ఈ-సిగరెట్లు, వివిధ రకాల వేప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో నిషేధించిన నికోటిన్ (Nicotine) ఉత్పత్తుల అక్రమ దిగుమతిపై డీఆర్‌ఐ నిరంతరం ఫోకస్ పెట్టింది. అయితే ఈ స్మగ్లింగ్ ముఠా అంతర్జాతీయ కస్టమ్స్ కళ్లు గప్పి, వివిధ పోర్టులు, ఎయిర్‌పోర్టులు ద్వారా బ్లాక్ మార్కెట్లలో యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.






