కొవ్వూరు రోడ్డు ప్రమాదంపై నారాలోకేష్ దిగ్భ్రాంతి

by Ajay Maddhiboyina |

కాకినాడ రూర‌ల్ కొవ్వూరు బ్రిడ్జి వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మంత్రి నారాలోకేష్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో న‌గుగురు ఉపాధి హామీ కార్మికులు దుర్మ‌ర‌ణం పాల‌వ్వ‌డం క‌ల‌చివేసిందని అన్నారు.

కొవ్వూరు రోడ్డు ప్రమాదంపై నారాలోకేష్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ రూర‌ల్ కొవ్వూరు బ్రిడ్జి వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మంత్రి నారాలోకేష్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో న‌గుగురు ఉపాధి హామీ కార్మికులు దుర్మ‌ర‌ణం పాల‌వ్వ‌డం క‌ల‌చివేసిందని అన్నారు. ఉపాధి ప‌నుల‌కు వెళుతూ ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌రం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. క్ష‌తగాత్రుల‌కు మెరుగైన వైద్యం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

మృతుల కుటంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఇదిలా ఉంటే కొవ్వూరు వంతెన స‌మీపంలో ఉద‌యం ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. కూలీలు రోడ్డు దాటుతున్న స‌మ‌యంలో టిప్ప‌ర్ లారీ వారిని ఢీకొట్ట‌డంతో దుర్ఘ‌ట‌న జ‌రిగింది. కూలీలు చీడ‌గ గ్రామానికి చెందిన‌వారిగా స‌మాచారం. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌వారిలో స‌త్య‌వ‌తి, కృష్ణ‌వేణి, చిట్టెమ్మ‌, అన్న‌వ‌రం అనే న‌లుగురు మ‌హిళ‌లు ఉన్నారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ‌గా వారిని కాకినాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Next Story