ప్రియురాలి నోట్లో బాంబులు పెట్టి పేల్చేసిన ప్రియుడు.. ఇంత క్రూరంగా మారడానికి కారణం ఏంటంటే?

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-25 13:49:39  IST  )

కర్ణాటక సాలిగ్రామలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహిత మహిళతో గత ఏడేళ్లుగా సంబంధంలో ఉన్న ప్రియుడు.. ఆగస్టు 23న లాడ్జ్‌లో హత మార్చాడు. ముందుగా చేతులు కట్టేసి.. నోట్లో పేలుడు పొడితో నింపిన ఎలక్ట్రిక్ డిటోనేటర్‌ను బలవంతంగా తోశాడు.

ప్రియురాలి నోట్లో బాంబులు పెట్టి పేల్చేసిన ప్రియుడు.. ఇంత క్రూరంగా మారడానికి కారణం ఏంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక సాలిగ్రామలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహిత మహిళతో గత ఏడేళ్లుగా సంబంధంలో ఉన్న ప్రియుడు.. ఆగస్టు 23న లాడ్జ్‌లో హత మార్చాడు. ముందుగా చేతులు కట్టేసి.. నోట్లో పేలుడు పొడితో నింపిన ఎలక్ట్రిక్ డిటోనేటర్‌ను బలవంతంగా తోశాడు. ఆ తర్వాత ఫోన్ చార్జర్‌తో పేల్చాడు. దీంతో మహిళ దారుణంగా చనిపోగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దర్శితకు కేరళకు చెందిన బస్ డ్రైవర్ సుభాష్‌తో వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమార్తె ఉంది. భర్త దుబాయ్‌లో పని చేస్తుండగా.. పెరియపట్నాకు చెందిన సిమెంట్ డీలర్ సిద్ధరాజుతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దాదాపు ఏడేళ్లుగా వీరిద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తుంది. అయితే కొద్ది రోజులుగా పడకపోవడంతో.. హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల ముందు నుంచే మర్డర్ ప్లాన్ వేస్తున్న సిద్ధరాజు.. ఆగస్టు 23న దర్శితను లాడ్జ్‌కు తీసుకెళ్లి హతమార్చాడు. గ్రానైట్ క్వారీల పనిలో అనుభవమున్న నిందితుడు.. డిటోనేటర్ల సహాయంతో చంపాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ పేలి చనిపోయిందని.. నమ్మించే ప్రయత్నం చేశాడు. తప్పించుకునేందుకు పారిపోతుండగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు దర్శిత భర్త ఇంట్లో 22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నాలుగు లక్షల నగదు చోరీ చేసిందనే కేసులో అనుమానితురాలిగా ఉంది. ఈ డబ్బు కోసమే వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగిందా అనే కోణంలోలోనూ దర్యాప్తు జరుగుతోంది.

Also Read.

వివాహిత అనుమానస్పద మృతి.. పోలీస్ వాహనం నడిపిన నిందితుడు

Next Story