అక్రమ నిర్మాణ ఇంటిలో వ్యక్తి దారుణ హత్య?

by Nallavelli.Anjaneyulu |

పిట్లం మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యాపారి సిద్ధులు నూతన నిర్మాణ ఇంటిలో వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది.

అక్రమ నిర్మాణ ఇంటిలో వ్యక్తి దారుణ హత్య?
X

దిశ, పిట్లం: పిట్లం మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యాపారి సిద్ధులు నూతన నిర్మాణ ఇంటిలో వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. పెయింటింగ్ కాంట్రాక్టర్ దిలీప్ వద్ద పని చేస్తున్న రాజేష్ అనే వ్యక్తి హత్యకు గురైనట్టు తెలుస్తోంది. పెయింటింగ్ వేసే సమయంలో కార్మికుల మధ్య మాట పెరిగి హత్య జరిగిందా..? లేదా వేరే కోణంలో హత్య జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, స్థానిక ఎస్సై వెంకట్ రావు హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీం, వేలిముద్ర సేకరణ నిపునులను పిలిపించి వివరాలు సేకరిం చడం జరుగుతుందని వారు తెలిపారు. నూతన గృహంలో యువకుడు హత్యకు గురికావడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఏది ఏమైనా వివరాలను సేకరించి హత్య ఉదంతాన్ని చేదిస్తామని సీఐ తిరుపయ్య తెలిపారు.

Next Story