హైదరాబాద్‌లో దారుణం..డబ్బు, బంగారం ఇవ్వలేదని!

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లో దారుణం..డబ్బు, బంగారం ఇవ్వలేదని!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మాదాపూర్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన పుట్టినరోజు సందర్భంగా జయంత్ గౌడ్ అనే యువకుడు మాదాపూర్ యశోద ఆస్పత్రి వెనుక స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. స్నేహితులతో కలిసి జయంత్ పార్టీ చేసుకుంటూ ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి బంగారం, డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. జయంత్ వారితో గొడవకు దిగడంతో అతడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. త‌ల్లి పుట్టిన‌రోజునే కొడుకు మ‌ర‌ణించ‌డంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు హ‌త్య చేసిన దుండ‌గుల కోసం గాలిస్తున్నారు.

Next Story