- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిని దూషించాడని హత్య.. నిందితుడిని పట్టుకున్న బచ్చన్నపేట పోలీసులు
మండల కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తి రాజిరెడ్డి హత్య కేసును బచ్చన్నపేట పోలీసులు స్ఫూర్తిదాయకంగా చేధించారు.

దిశ, బచ్చన్నపేట: మండల కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తి రాజిరెడ్డి హత్య కేసును బచ్చన్నపేట పోలీసులు స్ఫూర్తిదాయకంగా చేధించారు. నిందితులను అరెస్టు చేసి, మృతితో సంబంధమైన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జనగామ ఏసీపీ పాండరి నితిన్ చేతన్ మీడియాకు వివరించారు.
ఉమా సాగర్ అలియాస్ సన్నీ అనే వ్యక్తి బచ్చన్నపేట చౌరస్తాలో తన పునుగుల బండి నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏసీపీ పాండరి నితిన్ చేతన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజిరెడ్డి తరచూ సన్నీ తల్లిని అసభ్యంగా దూషించేవాడని, దాంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన మిత్రుడు కోరుబోతుల అరుణ్‌తో కలిసి రాజిరెడ్డిని హతమార్చినట్లు పేర్కొన్నారు. వీరికి కోరుబోతుల రాజు, తంగళ్ళపల్లి విజయ్‌లు సహకరించారు.
హత్యలో ఉపయోగించిన సిమెంట్ ఇటుక, మృతుడి దుస్తులను కాల్చిన వస్తువులు, పాయింటు ముక్కలు, స్కూటీ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్యకు సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసును త్వరగా ఛేదించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అబ్బయ్య, ఎస్సై ఎస్‌కే హామీద్, పోలీస్ సిబ్బంది ఎం. రాకేష్, టి. రామన్న, కె. అనిల్ కుమార్ యాదవ్, కె. భానుచందర్, ఎస్. శ్రీనివాస్, డి. తిరుపతిలను ఏసీపీ అభినందించారు.






