శ్రీచైత‌న్య క‌ళాశాల‌లో మ‌క్త‌ల్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-02 09:08:06  IST  )

దిశ‌, మ‌క్త‌ల్ : హైద‌రాబాద్ బాచుప‌ల్లిలోని శ్రీ చైత‌న్య జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఇంట‌ర్మీడియట్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న బాచుప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

శ్రీచైత‌న్య క‌ళాశాల‌లో మ‌క్త‌ల్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, మ‌క్త‌ల్ : హైద‌రాబాద్ బాచుప‌ల్లిలోని శ్రీ చైత‌న్య జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఇంట‌ర్మీడియట్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న బాచుప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణం రెడ్డి న‌గ‌ర్ కి చెందిన మాధ‌వ‌రెడ్డి-న‌ర్మ‌ద దంప‌తుల మొద‌టి కూతురు వ‌ర్షిత శ్రీచైత‌న్య క‌ళాశాల‌లో మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతుంది. అయితే మ‌క్త‌ల్ ప‌డ‌మ‌టి ఆంజ‌నేయ‌స్వామి జాత‌ర‌కు తీసుకురావ‌డానికి ఆదివారం త‌ల్లి న‌ర్మ‌దా శ్రీచైత‌న్య‌క‌ళాశాల వ‌ద్ద‌కు వెళ్లింది. త‌మ కూతురుని తిరునాళ్ల‌కు పంపించాల‌ని ప్రిన్సిపాల్ ని అడిగింది. అయితే ప్ర‌స్తుతం ప‌రీక్ష‌లు స‌మీపిస్తున్నాయని.. ఇంటికి పంపించేందుకు కుద‌ర‌ద‌ని చెప్పారు. దీంతో త‌ల్లి తిరిగి మ‌క్త‌ల్ కి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో త‌న తోటి విద్యార్థులు అంతా క్లాసుల‌కు వెళ్లిపోగా గ‌దిలో ఒంట‌రిగా ఉన్న వ‌ర్షిత మానసిక వేద‌న‌కు గురై ఫ్యాన్ కి ఉరేసుకుంది. ఈ విష‌యాన్ని క‌ళాశాల యాజ‌మాన్యం త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చారు. హుటాహుటిన మృతురాలి త‌ల్లిదండ్రులు శ్రీచైత‌న్య క‌ళాశాల వ‌ద్ద‌కు వెళ్లారు. త‌మ కూతురు చావుకు కార‌ణ‌మైన‌ శ్రీచైత‌న్య క‌ళాశాల యాజ‌మాన్యం పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Next Story