- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగర శివారులో ముజ్రా పార్టీ.. 35 మంది అరెస్ట్
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు రేవ్, ముజ్రా పార్టీలకు అడ్డాలుగా మారిపోతున్నాయనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు రేవ్, ముజ్రా పార్టీలకు అడ్డాలుగా మారిపోతున్నాయనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ ఫంక్షన్ పేరుతో ఫామ్ హౌజ్‌లను బుక్ చేసుకుంటున్న నిర్వాహకులు తీరా చూస్తే.. విదేశీ మద్యం, గంజాయి, డ్రగ్స్, అమ్మాయిలతో అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. ఇటీవలో మహేశ్వరంలోని ఓ రిసార్ట్స్‌లో ఏపీకి చెందిన పర్టిలైజర్ ఫ్యాక్టరీ యజమానికి తమ డీలర్లకు రేవ్ పార్టీ ఇచ్చాడు. అందులో ఏకంగా అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్ వంటి అశ్లీల కార్యక్రమాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యం లభించింది.
ఇది మరువక ముందే తాజాగా మరో ప్రాంతంలో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి లోని ఫార్మ్ హౌస్ లో లిక్కర్, మహిళలతో ముజ్రా పార్టీ నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న మంచాల పోలీసులు పార్టీ జరుగుతున్న ఫార్మ్ హౌస్ రైడ్ చేశారు. ఈ రైడ్ తర్వాత అనుమతి లేకుండా ముజ్రా పార్టీ నిర్వహించినందుకు 25 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్టు చేశారు. అలాగే వారి నుంచి రూ. 2,40,030 నగదు, 11 వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ముజ్రా పార్టీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






