- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదేళ్ల కూతురిని వ్యభిచార రొంపిలోకి దింపిన తల్లి.. 70ఏళ్ల వృద్ధుడితో పంపిస్తానని లక్షల్లో వసూల్
నవీ ముంబైలోని తలోజా ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురిని వ్యభిచారం రొంపిలోకి వెళ్లాలని తల్లి డిమాండ్ చేయడమే కాదు 70ఏళ్ల ఎన్‌ఆర్ఐ నుంచి కూతురిని పంపిస్తానని లక్షల్లో వసూల్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : నవీ ముంబైలోని తలోజా ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురిని వ్యభిచారం రొంపిలోకి వెళ్లాలని తల్లి డిమాండ్ చేయడమే కాదు 70ఏళ్ల ఎన్‌ఆర్ఐ నుంచి కూతురిని పంపిస్తానని లక్షల్లో వసూల్ చేసింది. ఈ కేసు మాతృత్వానికి మచ్చ కాగా మానవత్వం, నమ్మకద్రోహానికి సంబంధించిన అంశాలపై చర్చకు దారితీసింది. డబ్బుకు ఆశపడ్డ సొంత తల్లి ఈ పనికి ఒడిగడుతుందనే సమాచారం రావడంతో.. పోలీసులు రక్షించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంచారు.
కాగా లండన్‌కు చెందిన 70ఏళ్ల ఎన్‌ఆర్ఐ ఫరూఖ్ షేక్.. పదేళ్ల పాపను సెక్స్ వర్క్‌లోకి లాగేందుకు పదే పదే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె తల్లికి రెండున్నర లక్షలు చెల్లించాడని.. డబ్బుపై వ్యామోహంతో తల్లి కూడా ఓకే చెప్పేసింది. బిడ్డను టార్చర్ పెట్టింది. ఈ క్రమంలో పాపను తీసుకెళ్లేందుకు ఆ వృద్ధుడు భారత్, యూకే మధ్య ప్రయాణిస్తునే ఉన్నాడని తేలింది. దీంతో తల్లి, వృద్ధుడిని అదుపులోకి తీసుకుంది యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU). కాగా నిందితులపై పోక్సో, హ్యూమన్ ట్రాఫికింగ్‌తో సహా పలు సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి.






