- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో దారుణం.. ప్రియుడి కోసం కన్న కూతురుని చంపేసిన తల్లి
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్నకూతురునే తల్లి హతమార్చింది. ఈ దారుణ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్నకూతురునే తల్లి హతమార్చింది. ఈ దారుణ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతిలోని పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత (19)కి గతంలో వివాహం అవ్వగా భర్తతో గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త నుండి విడిపోయి కొంతకాలం తన తల్లి వద్దే ఉంది. అయితే ఈ క్రమంలో ఆమెకు ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ ఇద్దరూ సహజీవనంలో ఉంటూ పెళ్లి చేసుకోవాలని సైతం నిర్ణయించుకున్నారు. అయితే తమ పెళ్లికి చిన్నారి అడ్డుగా ఉందని కన్నతల్లే హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చి పెట్టింది. కాగా తన బిడ్డ, మనవరాలు ఈ నెల 19వ తేదీ నుండి కనిపించడంలేదు అంటూ ఆశాలత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. ఆశాలత తన బిడ్డను హత్య చేసినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






