దారుణం.. కలలో చెప్పారని.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి..

by Sujitha Rachapalli |

* రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది * కలలో చెప్పారని కన్న పిల్లలను హతమార్చిన తల్లి * సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్

దారుణం.. కలలో చెప్పారని.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి..
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని నవ్సరీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలలో పిల్లలను చంపమని చెప్పారని.. ఐదు, ఏడేళ్ల వయసు ఉన్న తన పిల్లలను చంపేసింది. ఆ తర్వాత మామ మీద కూడా ఎటాక్ చేసింది. సునీతా శర్మ ఈ దారుణానికి ఒడిగట్టగా.. హత్య చేసే సమయంలో పక్కనే సింహంపై వెళ్తున్న మాత ఫొటో ఉంచుకోవడంతోపాటు.. ఆమె జుట్టు విరబోసుకుని.. నుదుటన తిలకం పెట్టుకుని కన్న పిల్లలను చంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె మెంటల్ స్టేట్‌పై విచారణ చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ వైరల్ కాగా నిజంగానే అతీతశక్తులు పిల్లలను చంపమని చెప్పాయా లేక మానసిక అనారోగ్యం ఇందుకు కారణమైందా అనే విషయంపై నెట్టింట చర్చ జరుగుతోంది.

Next Story