తనకుతానే కాన్పు చేసుకుని.. బిడ్డను బ్లేడుతో కోసి చంపిన కర్కశ తల్లి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-24 05:23:55  IST  )

అనుకోకుండా వచ్చిన గర్భం.. ఇష్టం లేకుండా పుట్టిన బిడ్డ.. వెరసి ఆ తల్లి కనికరం లేకుండా..

తనకుతానే కాన్పు చేసుకుని.. బిడ్డను బ్లేడుతో కోసి చంపిన కర్కశ తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: అనుకోకుండా వచ్చిన గర్భం.. ఇష్టం లేకుండా పుట్టిన బిడ్డ.. వెరసి ఆ తల్లి కనికరం లేకుండా.. పసికందును కన్న వెంటనే బ్లేడుతో కోసి హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. ఆగస్టు 16న జరిగిన ఈ ఘటనలో తొలుత నిందితులు ఎవరో తెలియలేదు. దర్యాప్తులో కన్నతల్లే హంతకురాలని తేలడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా తిమ్లాపురకు చెందిన శైల అనే మహిళ ఆగస్టు 16వ తేదీన శివమొగ్గ జిల్లా ఆస్పత్రిలో చేరింది. తాను గర్భవతిని అన్న విషయం తనకు తెలియదని, తన మరదలు ప్రసవించేందుకు ఆస్పత్రిలో చేరగా చూడటానికి వెళ్లగా.. కడుపునొప్పితో తానుకూడా చికిత్సకు చేరానని చెప్పింది. తనకూ పురిటినొప్పులు రావడంతో బాత్రూంలోనే కాన్పు చేసుకుని, ఆ బిడ్డను వద్దనుకుని చంపేశానని నేరం అంగీకరించింది. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా బిడ్డ పుట్టడంతో చంపేసినట్లు పోలీసులకు తెలిపింది. ఈ విషయం తన కుటుంబానికి తెలియదని పేర్కొంది. దాంతో పోలీసులు శైలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Read More... బొల్లాపల్లిలో భర్త హత్యకేసును ఛేదించిన పోలీసులు.. భార్యే కిలాడి

Next Story