- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి వివాహేతర సంబంధం.. పాడు పని చేస్తుండగా చూసిన పదేళ్ల కొడుకు హత్య..
వారణాసిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి ప్రియుడితో కలిసి అసభ్యకర స్థితిలో ఉండటాన్ని చూసిన కొడుకును దారుణంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. సోనా శర్మ భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు పదేళ్ల బాబు సూరజ్ ఉన్నాడు. అయితే ఒంటరిగా ఉన్న సోనాకు ఫైజాన్ అనే యువకుడితో

దిశ, వెబ్ డెస్క్ : వారణాసిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి ప్రియుడితో కలిసి అసభ్యకర స్థితిలో ఉండటాన్ని చూసిన కొడుకును దారుణంగా హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. సోనా శర్మ భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు పదేళ్ల బాబు సూరజ్ ఉన్నాడు. అయితే ఒంటరిగా ఉన్న సోనాకు ఫైజాన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వీరిద్దరు ఇంటిమేట్ పొజిషన్‌లో ఉండగా సూరజ్ చూశాడు. దీంతో రగిలిసోయిన ఫైజాన్ పిల్లాడిని ఎలాగైనా చంపేయాలనుకుని.. బవన్ బీఘా పొదల్లోకి తీసుకెళ్లాడు. స్నేహితుడు రషీద్ హెల్ప్‌తో గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని అక్కడే పొదల్లో దాచాడు.
ఈ విషయం తెలియని సోనా.. రెండు రోజులుగా పిల్లాడి ఆచూకీ కోసం వెతికింది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు.. సోనా బిహేవియర్, ప్రతి విషయంలో ఫైజాన్‌ను ప్రస్తావిస్తుండటంతో.. అతనిపై ఫోకస్ చేశారు. విచారిస్తే నేరాన్ని అంగీకరించాడు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందు ఫైజాన్.. పిస్టల్ లాక్కుని కాల్పులు చేసేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు ఎదురు కాల్పులు చేయడంతో కాలికి గాయమై అక్కడే పడిపోయాడు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.






