- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డిలో దారుణం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య..
by Gantepaka Srikanth |
సంగారెడ్డి జిల్లా కంది మండలం జులకల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా కంది మండలం జులకల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు(మణికంఠ, ప్రళయ) పిల్లలకు విషమిచ్చి తల్లి మమత(28) ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గత జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో భర్త పెంటయ్య మరణించినట్లు పేర్కొన్నారు. అప్పటినుంచి మమత మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. భర్తలేని జీవితం కష్టంగా ఉందని భావించి, శనివారం మధ్యాహ్నం ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, వారిద్దరూ మరణించారని నిర్ధారించుకున్న తర్వాతనే ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






