- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం.. కుటుంబ కలహాలే కారణమా..?
by Chintha Aamani |
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, మేడిపల్లి: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేకల రాశి (26), తొమ్మిది సంవత్సరాల క్రితం మేకల రాజు ని ప్రేమ వివాహం చేసుకుని శ్రీనివాస నగర్, బోడుప్పల్ లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, భవ్య (8),దివ్య (5). రాశి ఓ మెడికల్ షాప్ లో పనిచేస్తుంది. జులై 27న రాత్రి భార్య, భర్తలు కుటుంబ విషయంలో గొడవ జరిగింది. మరుసటి రోజు ఆమె జాబ్ కని చెప్పి పిల్లలను తీసుకుని వెళ్లి ఇప్పటికి తిరిగి రాలేదు. ఈ విషయం పై మేకల రాశి తమ్ముడు ఏనుగు రాహుల్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, వీరు ఎక్కడైనా కనిపిస్తే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.
Next Story






