- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి
by Ratna Kumari |
దిశ, కోయిలకొండ : మండల పరిధిలోని దమ్మాయిపల్లి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకులు మృతి చెందారు. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల

X
దిశ, కోయిలకొండ : మండల పరిధిలోని దమ్మాయిపల్లి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకులు మృతి చెందారు. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కోయిలకొండ మండలం వీరన్నపల్లి గ్రామానికి చెందిన బలరాం (36), తన తల్లి ముత్యాలమ్మ (54) ను అనారోగ్యం కారణంగా మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి మోటార్ సైకిల్ పై తీసుకువెళ్లాడు. వైద్య సేవల అనంతరం తల్లి కొడుకులు ఇరువురు తమ సొంత గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో దమ్మాయిపల్లి గ్రామానికి చేరుకోగానే కోయిలకొండ వైపు నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న కారు వేగంగా మోటార్ సైకిల్ ను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తల్లి కొడుకులు అక్కడికి అక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






